Thursday, May 2, 2019

ఉగాది - ఉమ్మడి కుటుంబం

తెలుగువారి ఉగాది  - వెలుగులు నింపే ఉగాది
తర తరాల ఉగాది - తరగని ఆనందాల ఉగాది

ఆటుపోట్లు చవి చూస్తూ హైటెక్ యుగంలో అడుగిడిన మనకు
హైరానా , హడావుడి ,పెరిగాయి కాని ఆనందం, ఆహ్లాదం,ఆదరణ తగ్గాయి

బ్రతుకు తెరువు కోసమై బారులు తీరిన కుటుంబాల వలసలతో
ఉమ్మడి కుటుంబాల వేడుకలు ఉనికి లేక వెల వెల బోవుచున్నవి

పాశ్చాత్య సంస్కృతిలో, పుబ్బుల కల్చర్లతో
పతనం కారాదు మన యువత పదిలపరుద్దాం మన సంస్కృతిని

పచ్చపచ్చని పంట పొలాలు పక్షుల కిల కిలా రావాలు
పాడి కలిగిన పశుసంపదలతో పండ్లతోటల పల్లెసీమలు

పట్టు పరికిణీలతో ఉట్టిపడే చిట్టి చెల్లెళ్ళ ఆనందోత్సాహాలు
పల్లె పడుచుల కూని రాగాలు సంధ్య వేళలో గోధూళి

మచ్చుకైనా కానరాక మరుగున పడుచున్న
మన సంస్కృతిని మలి విడతగా పటిష్టపరుద్దాం

పచ్చ పచ్చని తోరణాలతో ఉదయాత్పూర్వపు తల స్నానాలతో
నూతన వస్త్ర ధారనలతో,దైవ దర్శనములతో, మాతృ మూర్తుల ఆశీస్సులతో

తీపి,పులుపు,చేదు,వగరు,కారం ఆదిగాగల షడ్రుచుల ఉగాది పచ్చడితో
అమ్మ చేసే బొబ్బట్లతో ఉమ్మడిగా జరుపుకునేదే అసలైన  ఉగాది మిత్రమా !


Thursday, July 11, 2013

క్రికెట్టు

క్రికెట్టు

బంతి బ్యాటుల  కనికట్టు
బహు దేశాలు ఆడే క్రికెట్టు
పరదేశములో మొదలైనా
 ప్రపంచమంతా కీర్తిస్తున్నది

ఆఫ్రికన్లు,ఆస్ట్రేలియన్లు ,ఆసియన్లు
కంగారులు,కరేబియన్లు,కేనిడియన్లు
ఐర్లేండ్ ,ఇంగ్లాండ్ దీశాలన్ని ఏకమై
విశ్వవేదికలపై వీక్షింప చేస్తున్నాయి

యార్కర్లు, గూగ్లీలతో
ఇన్స్వింగ్,షార్ట్ పిచ్ ,బ్లాకు హోల్  బాల్స్ తో
వెవ్ లెంత్ లన్ని మార్చి మార్చి
బంతులతో గజిబిజి చేసి
ఔరా అనిపిస్తారు  ఫేస్ బౌలర్స్

వైడ్ లు , నో బాల్స్ ,లెగ్ బై లు లేకుండా
హాట్రిక్ లు , మేడిన్లతో
హడలెత్తించే ఆఫ్ స్పిన్నర్స్
బోల్త కొట్టించే  స్పిన్ బౌలర్స్

ముక్కు మొఖము కనపడకుండా కట్టుకుని
బంతి గమన వేగాన్ని అనుసరించి
కసిగా ఒడిసి పట్టుకుని
రన్ రేటును నియంత్రిస్తూ
రన్ అవుట్, స్టంప్ అవుట్ లు చేసేది వికెట్ కీపర్లు

పరుగులెత్తించే బంతిని పట్టి
పరుగులకు ఆనకట్టలు వేస్తూ
ఫీల్దింగులకే వన్నె తెచ్చే
ఆల్ రౌండర్స్ ఎందరో

వీలైతే ఒకటి,రెండులతో,
లేదంటే బౌండరీ లు,సిక్సర్లతో
బంతులను చితక బాదుతూ
వరదల్లాంటి పరుగులతో
సెంచరీలతో వెంచర్లు చేసే బ్యాట్స్ మెన్లతో

చిన్న పెద్ద ఆడ మగ అందరికి
కను విందులు చేసే వింతయిన ఆటే
బాటు బంతుల కనికట్టు
ఖరీదయిన ఆట బలే క్రికెట్టు 

Sunday, September 9, 2012

నాణ్యతా సందేశం - నవశకానికి సంకేతం

నాణ్యతా సందేశం -  నవశకానికి   సంకేతం

రెండవ ప్రపంచ యుద్దాన - దండిగ చితికిన జపాను 
ఆలసింపక  తేరుకున్నది  - ఆదరించి  "నాణ్యతను "

జపానులోని "నాణ్యతా నినాదం "-తుఫానులాగా విస్తరించి 
సిపాయిలాగా కదిలింది - తురుపు ముక్కగా నిలిచింది 

ప్రపంచ దేశాలన్నింటా-ప్రశంసలెన్నో పొందినది 
పతాక స్థాయిన నిలిచినది-పథ నిర్దేశము చూపినది 

క్వాలిటీ సర్కిల్స్ కదలికలు- కర్మాగారాలకు కరదీపికలై 
విఫణి తీరుతెన్నులు వీక్షిస్తూ - వినియోగదారున్ని రక్షిస్తుంది 

ఉత్పత్తిలోన "నాణ్యతను"- ఉన్నత విలువలు పాటిస్తూ 
మార్కెట్టులోన మనుగడకై - మమేకమౌతూ సాగండి 

'నాణ్యత విలువలు' పాటిస్తూ - నవ నాగరికతలను అలరిస్తూ 
నాలుగు కాలాల మనుగడకై - నడుము బిగించి నడువండి 

"నాణ్యత" లోనే నిబీడీ కృతము - నాణానికి రెండు వైపులవలె 
మన అందరికి మనుగడ, మాతృ సంస్థల అభి వృద్ధి పరచి 
దేశ ఆర్థికాభివృద్ది కి బాటలు వేద్దాము   

Wednesday, August 3, 2011

ఇంధనాల పొదుపు

స్వర్ణ భారతి సంరంభం -ఇంధన పొదుపుతో ఆరంభం

పల్లె పట్నం తేడా లేదు - తెల్లవారితే డోకా లేదు 
పొగలేని వంట తయ్యారు - కాదంటే మనస్సు ఉస్సూరు 

పగలు రేయి ఎల్లెడలా -  పని ఉన్నాలేకున్నా 
సురీని మాట మరిచేము-టూబు, ఫాను వేసేము,  డాబు దర్జాగా బ్రతికేము .

ఆడ మగ తేడా లేదు - అవసర బెరీజసలె లేదు 
చిన్న పెద్దా దూరంకైనా- ఏదో ఒక్క వాహనం, కాదా ఖర్చిక ఇంధనం .

త్రాగు నీరే కదాని త్రోయబోకు -ప్రాణావసరంలో ద్వితీయమైన 
మానవాళి మనుగడకు అద్వితీయం మిత్రమా 
కాలుష్యాలను వదలబోకు- కడలి చేరే నదుల మలిన్యపరచకు 

ప్రభుత్వ పతకాలెన్నైనా- పౌర సహాయం లేకుంటే
అభాసు పాలు ప్రణాలికలు -అదోగతులే ప్రగతి రథానికి 

చిన్నా, పెద్దా ,ఆడా,మగ అండ తోనే - ఇంధన ఆదా సాధ్యము 
అందరి క్షేమము కోసమై - కొంచం త్యాగం చేయండి, అందించండి చేయూతను 

స్వర్ణ భారతి సంరంభం -ఇంధన పొదుపుతో ఆరంభం

Saturday, July 2, 2011

ఓ సునామి మళ్ళీ రాకు సుమా

కరువులు కాటకాలు- ఉప్పెనలు ఉపద్రవాలు
భూకంపాలు జల ప్రలయాలు - కాల చక్రములో రుతువుల్లగా
కళ్ళెర్ర చేస్తున్నాయి -కబలిస్తూనే ఉన్నాయి ప్రజానీకాన్ని

అయినా తీరని దాహంలా - కదిలావు తీరం వెంబడి
కార్చిచ్చు లా వ్యాపించి - కబలించావు ఊళ్లకు ఊళ్లు

కసాయి నీ హృదయంతో - కొల్లగోట్టావు ఇల్లు వాకిళ్ళు
కన్ను మూసి తెరిచినంతనే - కనుమరుగాయిరి బంధు మిత్రులు

ఆస్తి నష్టం , ప్రాణ నష్టం - అంతకంతకు పెరిగి పోయెను
ఆదమరిచి నిద్రిస్తున్న సమయాన - అదను చూసి కాటేసావు

అందుకే  ఓ సునామి మళ్ళీ రాకు సుమా