తెలుగువారి ఉగాది - వెలుగులు నింపే ఉగాది
తర తరాల ఉగాది - తరగని ఆనందాల ఉగాది
ఆటుపోట్లు చవి చూస్తూ హైటెక్ యుగంలో అడుగిడిన మనకు
హైరానా , హడావుడి ,పెరిగాయి కాని ఆనందం, ఆహ్లాదం,ఆదరణ తగ్గాయి
బ్రతుకు తెరువు కోసమై బారులు తీరిన కుటుంబాల వలసలతో
ఉమ్మడి కుటుంబాల వేడుకలు ఉనికి లేక వెల వెల బోవుచున్నవి
పాశ్చాత్య సంస్కృతిలో, పుబ్బుల కల్చర్లతో
పతనం కారాదు మన యువత పదిలపరుద్దాం మన సంస్కృతిని
పచ్చపచ్చని పంట పొలాలు పక్షుల కిల కిలా రావాలు
పాడి కలిగిన పశుసంపదలతో పండ్లతోటల పల్లెసీమలు
పట్టు పరికిణీలతో ఉట్టిపడే చిట్టి చెల్లెళ్ళ ఆనందోత్సాహాలు
పల్లె పడుచుల కూని రాగాలు సంధ్య వేళలో గోధూళి
మచ్చుకైనా కానరాక మరుగున పడుచున్న
మన సంస్కృతిని మలి విడతగా పటిష్టపరుద్దాం
పచ్చ పచ్చని తోరణాలతో ఉదయాత్పూర్వపు తల స్నానాలతో
నూతన వస్త్ర ధారనలతో,దైవ దర్శనములతో, మాతృ మూర్తుల ఆశీస్సులతో
తీపి,పులుపు,చేదు,వగరు,కారం ఆదిగాగల షడ్రుచుల ఉగాది పచ్చడితో
అమ్మ చేసే బొబ్బట్లతో ఉమ్మడిగా జరుపుకునేదే అసలైన ఉగాది మిత్రమా !
No comments:
Post a Comment