Wednesday, August 3, 2011

ఇంధనాల పొదుపు

స్వర్ణ భారతి సంరంభం -ఇంధన పొదుపుతో ఆరంభం

పల్లె పట్నం తేడా లేదు - తెల్లవారితే డోకా లేదు 
పొగలేని వంట తయ్యారు - కాదంటే మనస్సు ఉస్సూరు 

పగలు రేయి ఎల్లెడలా -  పని ఉన్నాలేకున్నా 
సురీని మాట మరిచేము-టూబు, ఫాను వేసేము,  డాబు దర్జాగా బ్రతికేము .

ఆడ మగ తేడా లేదు - అవసర బెరీజసలె లేదు 
చిన్న పెద్దా దూరంకైనా- ఏదో ఒక్క వాహనం, కాదా ఖర్చిక ఇంధనం .

త్రాగు నీరే కదాని త్రోయబోకు -ప్రాణావసరంలో ద్వితీయమైన 
మానవాళి మనుగడకు అద్వితీయం మిత్రమా 
కాలుష్యాలను వదలబోకు- కడలి చేరే నదుల మలిన్యపరచకు 

ప్రభుత్వ పతకాలెన్నైనా- పౌర సహాయం లేకుంటే
అభాసు పాలు ప్రణాలికలు -అదోగతులే ప్రగతి రథానికి 

చిన్నా, పెద్దా ,ఆడా,మగ అండ తోనే - ఇంధన ఆదా సాధ్యము 
అందరి క్షేమము కోసమై - కొంచం త్యాగం చేయండి, అందించండి చేయూతను 

స్వర్ణ భారతి సంరంభం -ఇంధన పొదుపుతో ఆరంభం

Saturday, July 2, 2011

ఓ సునామి మళ్ళీ రాకు సుమా

కరువులు కాటకాలు- ఉప్పెనలు ఉపద్రవాలు
భూకంపాలు జల ప్రలయాలు - కాల చక్రములో రుతువుల్లగా
కళ్ళెర్ర చేస్తున్నాయి -కబలిస్తూనే ఉన్నాయి ప్రజానీకాన్ని

అయినా తీరని దాహంలా - కదిలావు తీరం వెంబడి
కార్చిచ్చు లా వ్యాపించి - కబలించావు ఊళ్లకు ఊళ్లు

కసాయి నీ హృదయంతో - కొల్లగోట్టావు ఇల్లు వాకిళ్ళు
కన్ను మూసి తెరిచినంతనే - కనుమరుగాయిరి బంధు మిత్రులు

ఆస్తి నష్టం , ప్రాణ నష్టం - అంతకంతకు పెరిగి పోయెను
ఆదమరిచి నిద్రిస్తున్న సమయాన - అదను చూసి కాటేసావు

అందుకే  ఓ సునామి మళ్ళీ రాకు సుమా

Sunday, June 19, 2011

పర్యావరణం - పరిశుభ్రత

హొయలొలికే జలపాతాలు - హాయి గొలిపే పచ్చిక బయలు
చెట్లు, పుట్టలు, కొండా కోనలు- ప్రకృతి మనకిచ్చిన పర్యా'వర'ణం

పచ్చదనం వెల్లివిరిస్తే - వాతావరణానికి ఊపిరి
పరిశుభ్రత పాటిస్తే - పర్యావరణ పరిరక్షణ

అత్యవసరాలే కాకుండా - అవసరాలు తీర్చుకుంటూ
విలాసాల క్రీనీడలలో- కులాసాగా సాగుచున్నం

ఇంధనాల వెలికి తీత - ఇసుక మేటల  తరలింపు
పనికిరాని పరికరాలు- పడావు పడిన పరిశ్రమలు

కావేవి అనర్హం - కలుషిత వాతావరణానికి
గుండు సూది మొదలు - కొండ తొలుచు వరకు

జల కాలుష్యం, వాయు కాలుష్యం
వాహన కాలుష్యం, యాంత్రిక కాలుష్యం

శబ్ద కాలుష్యం , ధూళి కాలుష్యం
సకల కాలుష్యాల ఫలమే ఓ జోనుకు గండి

రక రకాల రవాణా సాధనాలు-రమ్యమైన కమ్యునికేషన్లు
రంగు రంగుల జీవితాలనిచ్చి- రక్తి కట్టిస్తున్నాయి మానవాళిని

కాలుష్యాలకు కారణాలనేకం- అధిక జనాభా, నిరక్షరాస్యత,
పట్టణీకరణ, పారిశ్రామికీకరణ - అరణ్యాల క్షీణత, అలసత్వం

కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు- కలకత్తా నుండి వోకా వరకు
కదలాడే రైలు బండి సాక్ష్యం - కవరు చిరిగిన పాలితీన్లకు

మానవ తప్పిదాల వలన - మానవాళికే విషమ పరిస్థితి
పెచ్చరిల్లే ఉపద్రవాలను - నియంత్రిచలేని దుస్థితి .

Saturday, June 18, 2011

భావి మార్గదర్శి

విద్యార్థి నీ జీవితం - గుర్తించు నీ గమ్యం
క్రమశిక్షనే శిరోధార్యం-కావలి నీవొక ఆదర్శం

అమ్మా నాన్నల అనురాగంలో- ఆరభించిన బాల్యాన్ని
పాటశాల    నీ పెన్నిధిగా -చదువు నేర్చుకో పదిలంగా

గురుబోధనలే పరమావధిగా- చిత్తశుద్ది ధ్రుడదీక్షలతో
పట్టుదలే నీ పెట్టుబడిగా -పట్టా పుచ్చుకో పరిణతితో

మత్తుమందుల  క్రీనీడలలో-గమ్మత్తుందని మురిసిపోకు
కూర్చి నేర్చుకో సంస్కారం- తీర్చి దిద్దుకో నీ భవితవ్యం

రాజకీయ రణరంగాలు- సంఘం లో అరణ్యాలు
మంచి మాత్రమే ఎంచుకో -మానవతను గుర్తుంచుకో

భ్రమించకు ఎండమావి ఎడారిలో-పయనించకు తీరం లేని సాగరంలో
కట్టుబాట్లు సదా ఆదరణీయం - కన్నవారి కలలకు సాఫల్యం

భాద్యత గల బాలునిగా - మలచుకో నీ జీవితం
భావి భారత పౌరునిగా- అందించు మార్గదర్శకత్వం




Thursday, June 16, 2011

అభయ ప్రదాత శ్రీ సాయినాథా

సాయిదేవా నమో నమో - సర్వ వినుత నమో నమో
శిరిడివాసా నమో నమో - చిద్విలాసా నమో నమో

నిర్మలమైన నీ చిరునగవు - నిర్భేధ్యమైన హిమనగము
శ్రద్ధ సబూరి నీ నిలయం  - సమర్థ సద్గురు సాయినామం

కోమలమైన నీ రూపం  - కోటి కాంతుల ప్రభమయము
భవ్యమైన నీ మోము -భక్తులకెంతో ప్రమోదము

సాటి మనిషిని చల్లగ చూసి - సౌభ్రాతృత్వం చాటినావు
సన్నిధి నీవై పెన్నిధి నీవై - సన్మార్గమున నడిపించావు

మాతృమూర్తుల మరిపించే- మమతా సమతలు చాటినావు
చూపులలోనే కరుణ నింపి - దారి చూపి గురువైనావు

ఆత్మను నిలిపి అంకితమౌతే- అభయప్రదాతగా నిలిచావు
అడగకముందే అన్నీ ఇచ్చి - ఆది దేవుడవు అయినావు

దత్తుడైనా, శ్రీపాదుడైన - నృసింహ సరస్వతి నీవే సుమా
మాణిక్య ప్రభువు, అక్కల్ కోట అవధూత - అన్నియు నీవై నిలిచావు,

ఆది తెలియదు అంతు చిక్కదు - అక్షయమైనది సాయి నామం
అనంతమైన మహిమలను - అవలోకించే ఆర్తిని ఇమ్ము

సాయి లీలలు సమస్తము - సాయి మహిమలు సమున్నతం
ఆధ్యాత్మికతను జోడించి - జ్ఞ్యాన మార్గమున నడిపించావు

మదినిండా నీవే ఉంటూ - కను విప్పులు కలిగించావు
హారతులంది ఆనందించి - కీర్తి కాంక్షలు తీర్చినావు

బంధము నీవే పాశము నీవే- పాత్రదారులము మేమంతా
బ్రతుకు గమ్యము నిర్దేశించు - పారమర్థము ప్రభోదించుము

కష్టములందు మరువకుండగా - కల కాలం మా మనసున నిలిచి
కాచి మమ్ము రక్షించుమయ్యా - కరుణా మూర్తివై కాపాడుమయ్యా

ఉగాది -పంచాంగ శ్రవణం


ఉషస్సు లాంటిది ఉగాది  తెలుగు కాల మానమునకు పునాది
ఆచరిస్తున్నాం అనాదిగా ఆదరిస్తున్నాము మనందరము

ప్రభవ విభవా ది వత్సరములతో  క్షయ వరకు ఓ కాల చక్రం సూచిస్తే
భూపరిభ్రమనాలతో సూర్యగమనాలతో ఉత్తర దక్షిణ ఆయనములుగా గుర్తించి
ఆరు ఋతువులతో ప్రకృతిని అలరిస్తుంది.

చంద్ర బ్రమణాన్ని నక్షత్రముల ఆధారముగా పన్నెండు మాసములుగా గణించి
పదునాలుగు తిథులతో శుక్లమందు వృద్ధితో క్రుష్ణమందు క్షీణిస్తూ పక్షములై నిలిచాయి.

ఇరువదేడు నక్షత్రములతో ఇరువదేడు యోగములతో
పదకొండు కరనములతో ఘడియలు, విఘడియలుగా విభజించి
వారములో ఏడురోజులుగా వాసికెక్కి నిలిచినది తెలుగు కాల ప్రమాణము.

తిథి, వార, నక్షత్ర, యోగ, కరనములె పంచ అంగములని ప్రసిద్ది
గ్రహ సంచార విభజననే రాశులుగా వర్ణించి  కాల గమనమునకు ఉన్న
సంబంధాలు వివరించీదే పంచాంగము.

తిథి వలన సంపదయు, వారము వలన ఆయుష్షు,
నక్షత్రము వలన పాప పరిహారము,యోగము   వలన వ్యాధి నివృతి
కరణము వలన కార్యానుకూలత  కలుగునని పూర్వీకుల నమ్మకము.

కాల గమన ప్రమాణాలు తెలియాలని పంచాంగ శ్రవణం అవశ్యం అన్నారు పెద్దలు.
అందుకే తెలుగు కాల ప్రమాణానికి ఉషస్సు లాంటిది ఉగాది.