విద్యార్థి నీ జీవితం - గుర్తించు నీ గమ్యం
క్రమశిక్షనే శిరోధార్యం-కావలి నీవొక ఆదర్శం
అమ్మా నాన్నల అనురాగంలో- ఆరభించిన బాల్యాన్ని
పాటశాల నీ పెన్నిధిగా -చదువు నేర్చుకో పదిలంగా
గురుబోధనలే పరమావధిగా- చిత్తశుద్ది ధ్రుడదీక్షలతో
పట్టుదలే నీ పెట్టుబడిగా -పట్టా పుచ్చుకో పరిణతితో
మత్తుమందుల క్రీనీడలలో-గమ్మత్తుందని మురిసిపోకు
కూర్చి నేర్చుకో సంస్కారం- తీర్చి దిద్దుకో నీ భవితవ్యం
రాజకీయ రణరంగాలు- సంఘం లో అరణ్యాలు
మంచి మాత్రమే ఎంచుకో -మానవతను గుర్తుంచుకో
భ్రమించకు ఎండమావి ఎడారిలో-పయనించకు తీరం లేని సాగరంలో
కట్టుబాట్లు సదా ఆదరణీయం - కన్నవారి కలలకు సాఫల్యం
భాద్యత గల బాలునిగా - మలచుకో నీ జీవితం
భావి భారత పౌరునిగా- అందించు మార్గదర్శకత్వం
No comments:
Post a Comment