Sunday, June 19, 2011

పర్యావరణం - పరిశుభ్రత

హొయలొలికే జలపాతాలు - హాయి గొలిపే పచ్చిక బయలు
చెట్లు, పుట్టలు, కొండా కోనలు- ప్రకృతి మనకిచ్చిన పర్యా'వర'ణం

పచ్చదనం వెల్లివిరిస్తే - వాతావరణానికి ఊపిరి
పరిశుభ్రత పాటిస్తే - పర్యావరణ పరిరక్షణ

అత్యవసరాలే కాకుండా - అవసరాలు తీర్చుకుంటూ
విలాసాల క్రీనీడలలో- కులాసాగా సాగుచున్నం

ఇంధనాల వెలికి తీత - ఇసుక మేటల  తరలింపు
పనికిరాని పరికరాలు- పడావు పడిన పరిశ్రమలు

కావేవి అనర్హం - కలుషిత వాతావరణానికి
గుండు సూది మొదలు - కొండ తొలుచు వరకు

జల కాలుష్యం, వాయు కాలుష్యం
వాహన కాలుష్యం, యాంత్రిక కాలుష్యం

శబ్ద కాలుష్యం , ధూళి కాలుష్యం
సకల కాలుష్యాల ఫలమే ఓ జోనుకు గండి

రక రకాల రవాణా సాధనాలు-రమ్యమైన కమ్యునికేషన్లు
రంగు రంగుల జీవితాలనిచ్చి- రక్తి కట్టిస్తున్నాయి మానవాళిని

కాలుష్యాలకు కారణాలనేకం- అధిక జనాభా, నిరక్షరాస్యత,
పట్టణీకరణ, పారిశ్రామికీకరణ - అరణ్యాల క్షీణత, అలసత్వం

కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు- కలకత్తా నుండి వోకా వరకు
కదలాడే రైలు బండి సాక్ష్యం - కవరు చిరిగిన పాలితీన్లకు

మానవ తప్పిదాల వలన - మానవాళికే విషమ పరిస్థితి
పెచ్చరిల్లే ఉపద్రవాలను - నియంత్రిచలేని దుస్థితి .

No comments: