Thursday, June 16, 2011

ఉగాది -పంచాంగ శ్రవణం


ఉషస్సు లాంటిది ఉగాది  తెలుగు కాల మానమునకు పునాది
ఆచరిస్తున్నాం అనాదిగా ఆదరిస్తున్నాము మనందరము

ప్రభవ విభవా ది వత్సరములతో  క్షయ వరకు ఓ కాల చక్రం సూచిస్తే
భూపరిభ్రమనాలతో సూర్యగమనాలతో ఉత్తర దక్షిణ ఆయనములుగా గుర్తించి
ఆరు ఋతువులతో ప్రకృతిని అలరిస్తుంది.

చంద్ర బ్రమణాన్ని నక్షత్రముల ఆధారముగా పన్నెండు మాసములుగా గణించి
పదునాలుగు తిథులతో శుక్లమందు వృద్ధితో క్రుష్ణమందు క్షీణిస్తూ పక్షములై నిలిచాయి.

ఇరువదేడు నక్షత్రములతో ఇరువదేడు యోగములతో
పదకొండు కరనములతో ఘడియలు, విఘడియలుగా విభజించి
వారములో ఏడురోజులుగా వాసికెక్కి నిలిచినది తెలుగు కాల ప్రమాణము.

తిథి, వార, నక్షత్ర, యోగ, కరనములె పంచ అంగములని ప్రసిద్ది
గ్రహ సంచార విభజననే రాశులుగా వర్ణించి  కాల గమనమునకు ఉన్న
సంబంధాలు వివరించీదే పంచాంగము.

తిథి వలన సంపదయు, వారము వలన ఆయుష్షు,
నక్షత్రము వలన పాప పరిహారము,యోగము   వలన వ్యాధి నివృతి
కరణము వలన కార్యానుకూలత  కలుగునని పూర్వీకుల నమ్మకము.

కాల గమన ప్రమాణాలు తెలియాలని పంచాంగ శ్రవణం అవశ్యం అన్నారు పెద్దలు.
అందుకే తెలుగు కాల ప్రమాణానికి ఉషస్సు లాంటిది ఉగాది.

No comments: